మణిపూర్ లోని ఖనిజ సంపదను దోచుకునేందుకు బిజెపి కుట్ర

మణిపూర్ లోని ఖనిజ సంపదను దోచుకునేందుకు బిజెపి కుట్ర
  • డబుల్ ఇంజన్ సర్కారు భర్తరఫ్ కంకణబద్దులు కావాలి
  • అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : మణిపూర్ లో జరిగిన అమానవీయ క్రూర దాష్టీకాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. మహిపూర్ లో మహిళలపై ఆకృత్యాలు, దేశాన్ని రాజ్యహింసతో హైందవీకరించడం, మైనారిటీలు, జాతులు, తెగలను నిర్మూలించడం బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఆర్ఎన్ఎస్, బిజెపి ప్రభుత్వ కుటిల పథకంలో భాగమేనన్నారు. మణిపూర్ ఘటనలో కారకులైన డబుల్ ఇంజన్ ధర్కారును భర్తరఫ్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ లో మణిపూర్ కుకి మహిళలపై అకృత్యాల వ్యతిరేక కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.అనంతరం ప్రెస్ భవన్ మణిపూర్లో మహిళలపై ఆకృత్యాల వ్యతిరేక కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ ఆద్వర్యంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత న్యాయవాది లుక్కా సౌమ్య వివరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ ప్రపంచంలోనే మణిపూర్ ఘటన భారతదేశం తలదించుకునేలా చేసిందన్నారు. మణిపూర్ కుకీ, జుమీ తెగల మద్య జరిగిన సంఘర్షణలను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు మరింత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మహిళలను నగ్నంగా తలదించుకునేలా చేసిందన్నారు. మణిపూర్ కుకీ, జుమీ తెగల మద్య జరిగిన సంఘర్షణలను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు మరింత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించి ఒళ్లు జళదరించేలా జరిగిన ఘటనను బిజెపి కుట్రలో భాగమేన్నాను. క్రిస్టియన్లు హిందువులుగా చేసేందుకు, సమాజాన్నే హిందువులుగా మర్చేందుకు బిజెపి పన్నిన కుట్ర అని మండిపడ్డారు. అందమైన మణిపూర్ లో రక్తపుటేరులను పారించారన్నారు. మహిళలను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. అక్కడి వనరుల సంపదను కొల్లగొట్టి అంబానీ, ఆదానీకి దోచిపెట్టేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర చేస్తున్నదన్నారు.

ఆదివానీ రాష్ట్రవతిగా మహిళ ఉన్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. మణిపూర్ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు? తక్షణకే కేంద్ర ప్రభుత్వం అట్టి కుకీ జోమీల తెగల మధ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని, ఆయుధాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ తెగల నిర్మూలన, హైందవీకరణను తిప్పి కొట్టి తెగలు, జాతుల ఐక్యతకై ఉమ్మడిగా ఉద్యమించాలని పిలువునిచ్చారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రమాదాన్ని నిరోధించడానికి ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకమై పోరాడాలన్నారు. ఈ నెల 6 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట మణిపూర్ ఘటనను నిరసిస్తూ ఆందోళలనలు చేపట్టాలన్నారు. అనంతరం ఏఐఎఫ్బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ లో ఇంత పెద్ద సంఘటన జరిగితే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని ఇలాంటి సంఘటన చూస్తే మనం భారతదేశంలో ఉన్నామని అనిపిస్తుందని అన్నారు. మణిపూర్ దానికి పాల్పడ్డ వాడిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు వివిధ పార్టీలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరించారు. 

మణిపూర్ ఘటనకు నిరసనగా ఈనెల 12న హైదరాబాదులో ఇందిరాపార్టు దగ్గర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉంది పెద్ద ఎత్తున మణిపూర్ ఘటనకు సంఘీభావంగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వానుదేవరెడ్డి,బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం,వైఎస్సార్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్,న్యాయవాది కొరివి వేణుగోపాల్, బిసి సంఘం నాయకుడు బిజిగిరి నవీన్ జేఏసీ చైర్మన్ వెంకట మల్లయ్య దళిత లేపరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్,ఆల్ ఇండియా ఫాదర్ బ్యాక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తేజ్ది ప్రదీప్ రెడ్డి తిమోతి జయరాజ్ క్రిస్టోఫర్, పాస్టర్ వెలిశా, తదితరులు మాట్లాడుతూ మణిపూర్ ఘటన పైన ప్రభుత్వాలు స్పందించకపోతే అందరం కలిసి ఒక దాటి పైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీధర్ రెడ్డి,ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ముత్యాల విజయ్ కుమార్ రాజశేఖర్,లాస్ట్ స్టూడెంట్ కృష్ణవేణి, పిడిఎస్ నాయకులు సాయి, అజయ్, బీడీ కార్మిక సంఘం నాయకులు రాజేశ్వరి,నామిని లక్ష్మి, జగదీష్ సదానందం మాజీ జెడ్పిటిసి స్వరూప,ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.