గ్రూప్-2 పరీక్షలు వాయిదా

గ్రూప్-2 పరీక్షలు వాయిదా
  • జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే అవకాశం

ముద్ర, తెలంగాణ బ్యూరో :  గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు  తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని  సర్వీస్​కమిషన్​కి  కలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన  టీఎస్​పీఎస్​సీ  వాయిదా వేస్తూ నిర్ణయం తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.