దళిత బంధు అర్హులకు ఇవ్వాలని ధర్నా 

దళిత బంధు అర్హులకు ఇవ్వాలని ధర్నా 

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు దళితులు ధర్నా నిర్వహించారు. అర్హులకు కాకుండా పార్టీ కార్యకర్తలకు దళిత బంధు మంజూరవటంపై ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ తీవ్రంగా విమర్శించారు. దళితులు వ్యవసాయ కూలీలుగా రకరకాల పనులు చేసుకుంటూ కార్మికులుగా జీవనం సాగిస్తున్న వారిని గుర్తించకుండా కేవలం పార్టీజెండా మోస్తున్న వారికి దళిత బంధు ఇస్తున్నారు. ఈ విధానం దుర్మార్గమైనదని విమర్శించారు. కార్యకర్తలకు ఇవ్వదలుచుకుంటే పార్టీ నాయకులు సంపాదించిన దాంట్లో నుండి ఇవ్వాలని ప్రభుత్వ ఖజానా నుండి పార్టీ కార్యకర్తలకు దళిత బంధు ఇస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులే స్వతంత్రంగా దళిత బంధు లబ్ధిదారులను గుర్తించాలని సురేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజులలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నల్లబుగా ధర్మయ్య, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి మంథని రవితేజ, దళిత మహిళలు చింతకుంట దుర్గమ్మ, లింగాల దుర్గమ్మ, మంథని సమ్మక్క, బెల్లంపల్లి లక్ష్మి, చింతకుంట్ల జ్యోతి, చింతకుంట స్వరూప తదితరులు పాల్గొన్నారు.