వర్గీకరణ కోరుతూ పాదయాత్ర

వర్గీకరణ కోరుతూ పాదయాత్ర

మహాదేవపూర్, ముద్ర: పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు నేడు ఎడపల్లి గ్రామం నుండి పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా మందకృష్ణ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నదని అనేక రాజకీయ పార్టీలు అట్టడుగు వర్గాల డిమాండ్ ను పట్టించుకోవడంలేదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ విమర్శించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముగింపు పలకాలని, శీతాకాల సమావేశాల్లో  వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి మాదిగల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్నారు. మందకృష్ణ మాదిగ తలపెట్టిన విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి పాదయాత్ర ద్వారా మాదిగలను సిద్ధం చేస్తున్నామని, న్యాయమైన డిమాండ్ తో  ముందుకు సాగుతుంటే ప్రభుత్వాలు కనీసం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ మండల కన్వీనర్ తూటిచర్ల దుర్గయ్య, సీనియర్ నాయకులు జక్కయ్య, మోతె సమ్మయ్య, నల్లబూగ సమ్మయ్య, చేకూర్తి శంకరయ్య, లేతకరి రాజబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి మంథని రవితేజ, నాయకులు చింతకుంట సదానందం, కొలుగూరి శ్రీకాంత్, నల్లబూగ బిక్షపతి, కొలుగూరి సుమన్, బెల్లంపల్లి జాషువా, కొయ్యల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.