కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ కార్మీకుల సమస్యలు పరిష్కరిస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ కార్మీకుల సమస్యలు పరిష్కరిస్తాం
  • పంచాయతీ కార్మీకుల సేవలు అమోఘం
  • ఏఐసీసీ కార్యదర్శి,ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. 

ముద్ర న్యూస్, కాటారం:రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఏఐసీసీ కార్యదర్శి,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.తమ డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు కాటారం మండల కేంద్రంలో చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంఘీభావం ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీ కార్మీకులు చేస్తున్న సేవలు అమోఘమని కీర్తించారు. పంచాయతీ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సమ్మెతో వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు.గ్రామాలు,పట్టణాలలో పారిశుద్ధ్య కార్మీకులు సేవలు అందించడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ కార్మీకుల పట్ల ప్రభుత్వం ద్వంద నీతి ప్రదర్శించరాదని సూచించారు.చాలీచాలని వేతనాలతో పంచాయతీ కార్మీకులు కుటుంబాలను పోషించుకోవడం భారమవుతుందని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, పంచాయతీ కార్మీకుల జేఏసీ నాయకులు మెండ మల్లేష్, దోమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.