ఘనంగా విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించిన కీర్తి రెడ్డి

ఘనంగా విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించిన కీర్తి రెడ్డి

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ  మండల కేంద్రంలో  బీజేపీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి  అధ్యర్యంలో సెప్టెంబర్ 17విమోచన దినోత్సవం సందర్బంగా  మండల కేంద్రంతో పాటు గోరి కొత్తపల్లి, కాకర్లపల్లి, రూపిరెడ్డి పల్లి, రేగొండ గ్రామంలో  జాతీయ జండా ఎగురావేసారు. రేగొండ మండల కేంద్రంలో  రేగొండ మాజీ సర్పంచ్ ఏడునుతుల విజేందర్ రెడ్డి, జండా ఎగురావేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి,  పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. భారతదేశానికి ఆగస్టు 15 1947న స్వాతంత్రం వస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 1948న స్వాతంత్రం వచ్చిందని. రజాకారుల కబంధ హస్తాల కింద నలిగిపోతున్న ప్రజల సమస్యలను తెలుసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, మిలటరీ బలగాలను పంపి రజాకారులను ఓడించి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటక మహారాష్ట్ర లోని కొన్ని జిల్లాలకు రజాకారుల బానిసత్వం నుండి విముక్తి కల్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంలో రోశయ్య,ను తెలంగాణ విమోచనమను అధికారికంగా నిర్వహించాలని నిలదీసిన కేసిఆర్, ఈరోజు సమైక్య దినంగా చేయాలని అధికారులను ఆదేశించడం సిగ్గుచేటు అని అసదోద్దీన్ ఓవైసీకి భయపడి సమైక్య దినంగా ప్రకటిస్తున్నాడని ఎద్దేవ చేసారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కీర్తి రెడ్డి గారు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశంలోని కులవృత్తులందరికీ ఆర్థిక సాయం అందించే విధంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ఈ ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాడని తద్వారా దేశంలో కులవృత్తి చేసుకునే వారికి ఆర్థిక సాయం కింద 3 లక్షల రూపాయలు రుణ అందిస్తారని అన్నారు తద్వారా కుల వృత్తి చేసుకునేవారు ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు నియోజకవర్గ ప్రజలందరి తరఫున భారత ప్రధాని నరేంద్ర మోడీ,  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శ ఏడునుతుల నిషిధర్ రెడ్డి. జిల్లా ఉపాధ్యక్షుడులింగంపల్లి ప్రసాద్ రావు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పో లిసాని తిరుపతిరావు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాంతల సర్వోత్తమ్ రెడ్డి. గన్ రెడ్డి లింగారెడ్డి. మెతుకుపల్లి బుచ్చిరెడ్డి. గాదె రమేష్.  మండల ప్రధాన కార్యదర్శి పెండల రాజు. కౌడగా రాకేష్, మాత శంకర్, కురాకుల మల్లయ్య, తూర్పాటి మల్లేష్, చావడి సంతోష్, మాచర్ల వరప్రసాద్,లు పాల్గొన్నారు..