విజయం మనదే

విజయం మనదే

ఎన్నికల తరవాత కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామణరావు ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఈ ఎన్నికల్లో విజయం మనదేనని, ఎన్నికల తరవాత కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామణరావు ఆశ భావం వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో సమాలోచన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్ల పనిచేశారని,ఈ ఎన్నికల్లో మనమే విజయం సాధిస్తున్నామని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, విజయ రమణారావు కార్యకర్తలకు, నాయకులకు తెలిపారు, తన గెలుపుకు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు, మహిళలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, నిరంతరం ప్రజాసేవకే అంకితం అవుతామని విజయ రామాణరావు కార్యకర్తలకు హామి ఇచ్చారు.