ఎల్లలు దాటిన పులిగిల్ల కీర్తి 

ఎల్లలు దాటిన పులిగిల్ల కీర్తి 
  • ఐర్లాండ్​లో దేవాన్ష్​రెడ్డి ప్రతిభ.. 
  • సొంత జిల్లాలో సంబురాలు
  • ఎల్లలు దాటిన తెలంగాణ కీర్తి
  • ప్రపంచ సైక్లింగ్​ఛాంపియన్​షిప్​లో స్థానం

హైదరాబాద్​: బీఎంఎక్స్​రేసింగ్​ యూసీఐ  ప్రపంచ సైక్లింగ్​ఛాంపియన్​షిప్​ గ్లాస్కో, స్కాట్లాండ్​లో స్థానం సంపాదించి తన సత్తా చాటుకున్నాడు కోలన్​ దేవాన్ష్​రెడ్డి. పిన్న వయస్సుల్లోనే విశేష ప్రతిభ కనబర్చిన దేవాన్ష్​రెడ్డిని సాక్షాత్తూ ఐర్లాండ్​ ప్రధానమంత్రి లియో వరాద్కర్​ అభినందించడం విశేషం.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే.. దేవాన్ష్​రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా పులిగిల్ల గ్రామం. కోలన్​ కమలాకర్​, జ్యోతిరెడ్డిలు దేవాన్ష్​ తల్లిదండ్రులు వృత్తిరీత్యా వీరు ఐర్లాండ్​లో స్థిరపడ్డారు.

ఈ సందర్భంగా ప్రధాని దేవాన్ష్​ను అభినందించారు. చిన్న వయస్సుల్లోనే ప్రపంచ చాంపియన్​గా నిలవడం గర్వకారణమన్నారు. 

ప్రధాని లియోకు కృతజ్ఞతలు తెలుపుతూ...

ప్రధాని లియోకు కృతజ్ఞతలు తెలుపుతూ యాదాద్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి చిత్రపటాన్ని ప్రధాన మంత్రికి అందించారు. తన కృషి, ప్రతిభా పాటవాలకు తల్లిదండ్రులు, గురువులతో ప్రోత్సాహం లభించిందని దేవాన్ష్​ పేర్కొన్నారు.

తన విజయంలో శ్రేయోభిలాషుల పాత్ర ఉందని వెల్లడించారు. వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా దేవాన్ష్​రెడ్డి అనేక విజయాలు సాధించారు.

2022లో కాన్ఫిడెరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీస్ ఇన్ ఐర్లాండ్ స్టూడెంట్ ఆఫ్ ఇయర్, డెక్కన్ క్లబ్ ఆఫ్ ఐర్లాండ్ టాలెంట్ అవార్డ్, బీఎంఎక్స్ ఐర్లాండ్ బెస్ట్ న్యూ కమర్ జాతీయ అవార్డ్ తో సత్కరించారు. 2023లో ఉత్తమ విద్యార్థి గా స్పిరిట్ ఆఫ్ ది స్కూల్ అవార్డ్ ను అందుకున్నారు.

దేవాన్ష్ ​ప్రతిభతో యాదాద్రి భువనగిరి జిల్లా పులిగిల్ల గ్రామ వాసులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ‘చేయూత ఫౌండేషన్ చెర్మన్ వాకిటి రామ్ రెడ్డి’ హృదయపూర్వక దేవాన్ష్​కు అభినందనలు తెలిపారు.