గోదావరిఖని లో మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు అరెస్ట్ - రామగుండం సిపి రెమా రాజేశ్వరి

గోదావరిఖని లో మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు అరెస్ట్ - రామగుండం సిపి రెమా రాజేశ్వరి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తమ ఉనికి ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయ త్నాలలో భాగంగా, సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావ రిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుడిని అరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ మిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం సిపి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం ఆర్డరాత్రి గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి చేతిలో సంచితో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తూ పోలీస్ లకు కనిపించినాడని, అతను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలిసులు అతడిని సమీపంగా వెళ్లగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడని, దీంతోవెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా అతడు సీపీఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా,  సికాస కార్యక్రపాలను విస్తరిం చడానికి పార్టీ ఆదేశాలతో గోదావరీఖనికి వచ్చినట్టు అంగీకరించాడని సిపి తెలిపారు. 


నిందితుడు అవినాష్ వద్ద కొన్ని వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.  నిందితుడు పామిడిమల్ల అవినాష్ (29) గ్రా. సోతులురు, నాదెళ్ల మండలం, పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏసిపి తూల శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ ప్రమోద్ రావు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.