బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న పార్టీ సింబల్స్ బెడద...

బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న పార్టీ సింబల్స్ బెడద...

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు తర్వాత చాలా వచ్చాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్, ఆటో ఇలాంటివి. ఇవి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ఇవి చూడ్డానికి కార్ లాగే ఉండడంతో గత ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్ కు వేస్తున్నామనుకుని ఇతర పార్టీలకు ఓటు వేసేశారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓట్లను కోల్పోయింది. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ ఇదే సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ టెన్షన్ మొదలైంది.