‘పుట్ట' గెలుపు కోసం కాళేశ్వరంలో పూజలు 

‘పుట్ట' గెలుపు కోసం కాళేశ్వరంలో పూజలు 

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సన్నిధానంలో భారాస అభ్యర్థి పుట్ట మధన్న గెలుపు కోసం దేవస్థాన పాలకమండలి డైరెక్టర్లు కలికోట దేవేందర్, కామిడి రాంరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల మేలుకోరే మంచి మనసున్న తమ నాయకుడు పుట్ట మధు కార్య క్షేత్రంలో విజయం సాధించేవిధంగా కాళేశ్వర ముక్తీశ్వరుడు శక్తిని అనుగ్రహించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ప్రకటన తెలిపారు. ప్రజలే నా సర్వస్వం అని ప్రజా సేవకు అంకితమైన నాయకుడు పుట్ట మధు శాసనసభ ఎన్నికలకార్యంలో విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించారు.