జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
  • రాష్ట్ర ప్రభుత్వానికి టీయుడబ్ల్యూజే విజ్ఞప్తి

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారంనాడు హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు జే హెచ్ ఎస్ పథకానికి నిధులు మంజూరు చేసి సమర్థవంతంగా అమలు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే మహాసభ నిర్వహణ, సంస్థాగత వ్యవహారాలపై కార్యవర్గం చర్చించింది.

యూనియన్ అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఏ. మాజీద్,  టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, టి.కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శులు ఫైసల్ అహ్మద్, గాడిపల్లి మధుతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.