దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి సేవలు మరువలేనివి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి సేవలు మరువలేనివి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నవయుగ వైతాళికుడు, దళిత ఉద్ధారకుడు భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం లో  అధికారికంగా  నిర్వహించిన  భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి వేడుకల్లో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి  పాల్గొని 
భాగ్యరెడ్డి వర్మ  చిత్రపటానికి    పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ  సంఘ సంస్కర్తగా, ఆది ఆంధ్ర సభ స్థాపకుడిగా హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు.భాగ్యరెడ్డి వర్మ  అణగారిన వర్గాల కోసం  విద్యా విప్లవాన్ని సృష్ఢించి మహాత్మ జ్యోతి రావు పూలే  వారసత్వాన్ని కొనసాగించారన్నారు. వారి స్ఫూర్తి తోహైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ పాఠశాలను ప్రారంభించి చదువును అందించారన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో సంఘసంస్కరణలకు జీవితాంతం   విశేష కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమం లో  అదనపు కలెక్టర్  రాంబాబు,  మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,  రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.