అవార్డు గ్రహీత సర్పంచుకు సన్మానం

అవార్డు గ్రహీత సర్పంచుకు సన్మానం

మహాదేవపూర్,ముద్ర: జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కించుకున్న సర్పంచ్ శ్రీపతిబాపు మరియు గ్రామ కార్యదర్శి సమ్మయ్య ను కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్, మాజీ ఎంపీపీ కలికోట దేవేందర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య గొప్పగా నిర్వహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం ఆనందాన్ని కలిగించిందని వారిని సన్మానించడం మన సంప్రదాయమని కలికోట దేవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, మాజీ కాళేశ్వరం దేవస్థాన ఛైర్మెన్ పోత వెంకటస్వామి, సీనియర్ నాయకులు ఆన్కారి ప్రభాకర్, కారేంగుల బాపురావు, జాడి గట్టయ్య, వేముల కిష్టయ్య, పెండ్యాల నరసింహస్వామి, కడారి రమేష్, చిటికెసి శ్రీనివాస్, పోత రమేష్, చాగర్ల రాజు, దుర్గం పోచయ్య, చింతకుంట్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.