మంథని లో ఆధార్ సెంటర్ పనులు కాక ప్రజలు ఆగం ఆగం...

మంథని లో ఆధార్ సెంటర్ పనులు కాక ప్రజలు ఆగం ఆగం...
  • ఆధార్  నిర్వాహకులు నిర్లక్ష్యం పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని లో ఆధార్ సెంటర్ పనులు కాక ప్రజలు ఆగం ఆగం అవుతున్నారు, కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు చిరునామా లు మార్చడానికి, పిల్లల కు ఆధార్ కార్డ్ దింపడం కోసం ప్రజలు ఆధార్ సెంటర్ల కు వస్తే పనులు కాకపోవడంతో ప్రజలు నిర్వాహకుల ను పనులు ఎందుకు అవుతలేవు అని ప్రశ్నించగా నిర్లక్ష్యం తో  సమాధానం చెబుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన పడుతున్నారు. రేషన్ కార్డు కోసం ఆధార్ అప్డేట్ చేసుకోడానికి ఈ నెల 31 వరకు టైం ఉందిని, దీంతో చిన్నపిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుందామని  మంథని పట్టణంలోని  ఆధార్ సెంటర్ వస్తే  మూసి ఉంటున్నాయని, తీసి ఉన్న సెంటర్ లో పని చేయట లేదని ప్రజలు అవేదదన వ్యక్తం చెస్తున్నారు. అధికారులు వెంటనే ఆధార్ సెంటర్ ను తనిఖీలు చేసి  పనులు అయ్యేల చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న ఆధార్ సెంటర్ ల పై  కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.