రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
  • కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వరికోల్ పల్లి, కుర్మపల్లి, గాంధీ నగర్, నైన్ పాక, జడల్ పేట గ్రామాల్లో పర్యటించి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు, అన్యాయాలు, వారు చేసిన మోసాలు అన్నింటిని  అణచివేస్తానని అన్నారు. మేనిఫెస్టోలో తెలిపిన ఆరు గ్యారంటీలను వారు వివరిస్తూనే,మరోవైపు బీఆర్ఎస్ నాయకుల ఆగడాలపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను వారికి వివరించారు..ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్,వితంతు మహిళలకు రూ.4000ల పెన్షన్ అందించడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సాధికారతకై తోడ్పడునందిస్తుందని తెలిపారు. కెసిఆర్ కేవలం గాలిలో మేడలు కట్టే మాటలు మాట్లాడతారని, ఆ మాటలు నీళ్ల మూటలని అని ఎద్దేవా చేశారు.స్థానిక ఎమ్మెల్యే ఇసుక దందా, భూకబ్జా, అక్రమ కాంట్రాక్టులతో సతమతమవుతున్నారని, వారికి ప్రజల సమస్యలు పట్టించుకునేంత తీరిక కూడా లేదని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీపై గెలిచి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీని చేరిన స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించాలని, చూపించాలని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి ఒక్క హామీను నెరవేర్చడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కటంగూరి రామ్ నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు కాసర్ల రామ్ రెడ్డి,మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి,సి ఆర్ పల్లి సర్పంచ్ మొకిరాల రాల మధువంశికృష్ణ, నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, కాట్రేవుల సాయిలు, గుమ్మడి శ్రీదేవి, మెరుగు లక్ష్మి, రమేష్,తిరుపతి, తానిష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.