రమణన్న గెలుపు ఖాయం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్

రమణన్న గెలుపు ఖాయం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లిలో గండ్ర రమణన్న గెలుపు ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఆదివారం గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిన్న గ్రామంగా ఉన్న భూపాలపల్లిని నగర పంచాయతీగా, పురపాలక సంఘంగా, జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేశారన్నారు.

విద్యా పరంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీల గురుకులాలు నెలకొల్పడం జరిగిందన్నారు. వైద్య పరంగా ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  పట్టణంలో బస్తీ దావకణాలు,100 పడకల ఆసుపత్రిని నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల కోసం 1000 డబల్ బెడ్ రూమ్ లు కట్టించినారని, జీవో 76 ద్వారా సింగరేణి నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గండ్ర వెంకట రమణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు జక్కం రవి, మల్లారెడ్డి, కత్కోజుల రాజు, బుర్ర కుమారస్వామి గౌడ్, బుర్ర సాగానందం గౌడ్, రడపాక రమేష్, గుజరాత్ రాజు, మహిళా లీడర్లు పాల్గొన్నారు.