24 గంటల పోలీస్ కస్టడీకి జంగిలి సాగర్

24 గంటల పోలీస్ కస్టడీకి జంగిలి సాగర్

సోదాల్లో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్యే గంగుల ప్రధాన అనుచరుడు సీతారాంపూర్ 21వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ ను 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇప్పటికే సీతారాంపూర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం మిగతమే. దీంతోపాటు మరో ఐదు కేసులు అతనిపై ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేశారు.

ఇందులో భాగంగా కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించినట్లు సమాచారం. ఈరోజు జంగిల్ సాగర్ నివాసం పై పోలీసులు సోదాలు నిర్వహించగా విలువైన డాక్యుమెంట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ కస్టడీ కి తీసుకొని మరింత  విలువైన సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయి.