లోక్ సభ ఎన్నికల తర్వాత 10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత 10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్
  • పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్న కేసీఆర్
  • పొలంబాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన 
  • మొదట కరీంనగర్ రూరల్‌ జిల్లా, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన

లోక్ సభ ఎన్నికల తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. పొలంబాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

మొదట కరీంనగర్ రూరల్‌ జిల్లా ముగ్ధుంపూర్‌లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. అండగా ఉంటామంటూ రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శాభాష్‌పల్లి వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు.