Odisha Bus Accident - ఒడిశా లో ఘోర ప్రమాదం... 5 మంది మృతి, 40 మందికి గాయాలు..!

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఒడిశా లో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెన పై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్ర గాయాలయ్యాయి. 50 మంది ప్రయాణికులతో బస్సు పూరీ నుంచి కోల్‌కతా కు వెళ్తుండగా జాతీయ రహదారి-16లోని బారాబతి వంతెనపై నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో కింద పడిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో నలుగురు పురుషులు, ఒక మహిళ మరణించారు. దాదాపు 40 మంది గాయపడ్డారు, వారిలో 30 మందిని కటక్ SCB మెడికల్ కాలేజీకి తరలించినట్లు ధర్మశాల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తపన్ కుమార్ నాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.