మోటార్ సైకిళ్ల సైలెన్సర్ల మార్పుపై పోలీసుల ఉక్కుపాదం

మోటార్ సైకిళ్ల సైలెన్సర్ల మార్పుపై పోలీసుల ఉక్కుపాదం

పోలీసుల స్పెషల్ డ్రైవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: యువత తమ మోటార్ సైకిళ్ళ సైలెన్సర్లు మార్చి ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించటం ఫ్యాషన్ గా మారింది. దీని వల్ల వాహనాలు పెద్ద శబ్దం చేస్తూ రోడ్లపైకి రావడం, మిగిలిన ప్రజలు భయభ్రాంతులకు గురి కావటం ప్రతి రోజూ పరిపాటిగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్మల్ పోలీసులు శనివారం శ్రీకారం చుట్టారు. శనివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇలా సైలెన్సర్లు మార్చిన వాహనాలను పట్టుకుని వాటి సైలెన్సర్లు తొలగింపచేసారు. అంతేకాదు... ప్రజలు చూసేలా శివాజీ చౌక్ లో వాటిని రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మల్ డి ఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు మార్చి ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.