శభాష్ వీణవంక పోలీస్

శభాష్ వీణవంక పోలీస్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :వీణవంక పోలీసులు నిర్వహిస్తున్న  కార్యక్రమాలపై శభాష్ వీణవంక పోలీస్ అంటూ మండల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక బాధ్యత నిర్వహణలో పోలీసులు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.  మంగళవారం పోలీసులు మీకోసం లో భాగంగా వీణవంక మండలం  ఎల్బాక గ్రామంలో పలు అంశాలపై అవగాహన  కార్యక్రమం నిర్వహించారు.  జమ్మికుంట రూరల్ సీఐ జే.సురేష్, వీణవంక ఎస్ఐ  కే .శేఖర్ రెడ్డి లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, యువత చెడు వ్యసనాల నియంత్రణ, మహిళల భద్రత, యువత, విద్యార్థులు విద్యలో, క్రీడల్లో ఎలా విజయం సాధించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. దీంతోపాటు వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం పై వివరించారు. అనంతరం యువతకు క్రీడ సామాగ్రిని అందించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.