ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఈవీఎం, వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలయిన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. ఈవీఎం ద్వారా పోలయిన ఓట్లను వీవీ ప్యాట్ లతో సరిపోల్చాలంటూ దాఖలయిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు తెలిపింది. పేపర్ బ్యాలట్ రూపంలో ఎన్నికలను నిర్వహించాలన్న పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

భద్రపర్చాలంటూ...

అయితే సీల్ చేసిన సింబల్, లోడింగ్ యూనిట్లను స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మాత్రమే తర్వాత స్థానంలో నిలిచిన వారు వారం రోజుల్లో వెరిఫికేషన్ ను కోరుకోవచ్చని, అందుకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థి మాత్రమే భరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.