కనకమామిడి గ్రామంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువు 82వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

కనకమామిడి గ్రామంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువు 82వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువు 82వ వార్షికోత్సవాలు బుధవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి.మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కనకమామిడితోపాటు చుట్టుపక్కల అనేక గ్రామాలు హైదరాబాద్ నుంచి వందలాది మంది భక్తులు హాజరవుతారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు దత్తాత్రేయ స్వామికి, వారణాసి రామయ్య ప్రభువుకు అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

అనంతరం వారణాసి రామయ్య గారి చిత్రపటాన్ని కనకమామిడి గ్రామ వీధుల్లో ఊరేగించారు. సిద్ధులూరు పూడూరు చేవెళ్ల, నారెగూడెం, కమ్మిట, గొల్లూరు గూడెం, బొబ్బిలిగామ, తాళ్లపల్లి, కొ మురబండ, చందానగర్ గ్రామాలకు చెందిన బృందాలు బుధవారం రాత్రి వరకు భజనలు నిర్వహిస్తాయని శ్రీ వారణాసి రామయ్య ప్రభు మఠం ట్రస్ట్ అధ్యక్షులు కొండా లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం వరకు వైభవంగా జరిగే వారణాసి రామయ్య ప్రభువు వార్షికోత్సవాలలో అందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.