వైద్యుడి అవతారం ఎత్తిన సెక్యూరిటీ గార్డ్

వైద్యుడి అవతారం ఎత్తిన సెక్యూరిటీ గార్డ్
  • నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి పరిస్థితి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు :  జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓ సెక్యూరిటీ గార్డు వైద్యుడి అవతారమెత్తాడు. రోడ్డు ప్రమాదం మరో లో గాయపడిన క్షతగాత్రులకు సెక్యూరిటీ గార్డు లోకి వైద్యసేవలు అందించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన ఆరుగురు ఆటోలో కుమ్మెర గట్టు మల్లయ్య బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా. కుమ్మెర సమీపంలో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ఐదుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ.. ఓ సెక్యూరిటీ గార్డు తెలిసీ తెలియని వైద్యం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైద్యుడు నిర్వహించాల్సిన పనులను సెక్యూరిటీ గార్డుతో చేయించడంపై బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జనరల్ ఆస్పత్రిలో క్షతగా త్రులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. విధి నిర్వహణలో అలసత్వం వహిం చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే వార్డ్ బాయ్స్ తరచూ డుమ్మాలు కొడుతుండడం వారికి అడ్డు అదుపు లేకుండా పోతుండడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు అనుకుంటూ ఉండడం విశేషం