మను చరిత్ర కథలో భాగంగా ఫైట్స్, సీన్స్ వస్తాయి 

మను చరిత్ర కథలో భాగంగా ఫైట్స్, సీన్స్ వస్తాయి 

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మను చరిత్ర'. ఇంటెన్స్ లవ్ స్టొరీగా రూపొందింది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో శివ కందుకూరి ముచ్చటించారు.  నేను టైటిల్ రోల్ ప్లే చేశా. నా పాత్ర పేరు మను. అతడి ఏడెనిమిదేళ్ళ జీవితాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అందుకే, 'మను చరిత్ర' టైటిల్ యాప్ట్ అనిపించింది. ట్రైలర్ లో చూపించినట్లు మను క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒక కాలేజీ స్టూడెంట్ ఎందుకు అలా అయ్యాడనేది మేం చెబుతున్నాం. అందులో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాం. మనం కొత్తగా ఏ ప్రేమకథను చెప్పలేం. నేపథ్యమే కథను కొత్తగా మారుస్తుంది. వరంగల్ గుండాయిజం నేపథ్యంలో దర్శకుడు కథ రాశారు. అందరూ రిలేట్ చేసుకునేలా క్యారెక్టర్ ఉంటుంది. అలాగే, చాలా షేడ్స్ ఉంటాయి.  నేను వేరే సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నాను. లిరిసిస్ట్ సిరాశ్రీ గారు చెప్పడం ద్వారా ఆ ఆడిషన్ కు వెళ్ళా. భరత్ గారు ఆ ఆడిషన్ టేప్ చూసి 'మను చరిత్ర' కోసం కాంటాక్ట్ చేశారు. యాక్టర్ గా కమర్షియల్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అప్పటి వరకు విన్న కథలు టెంప్లేట్ మోడ్ లో ఉన్నాయి. 'మను చరిత్ర' కథ విన్నప్పుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఆర్గానిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫోర్స్డ్ గా ఫైట్స్, సీన్స్ ఉండవు. కథలో భాగంగా అన్నీ వచ్చాయి. నటుడిగా ఎదగడానికి ఇటువంటి కథ అవసరం అనిపించింది. విన్న వెంటనే ఓకే చెప్పేశా.  క్రెడిట్ అంతా డైరెక్టర్ భరత్ గారికి ఇవ్వాలి. నాకు ఫస్ట్ టైమ్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు మూడు గంటలు చెప్పారు. ప్రతిదీ డిటైలింగ్ గా నేరేట్ చేశారు. షాట్ మేకింగ్, కెమెరా యాంగిల్స్ నుంచి క్లియర్ గా చెప్పారు. దర్శకుడిగా ఆ క్లారిటీ ఉన్నప్పుడు యాక్టర్స్ వర్క్ ఈజీ అవుతుంది. ఆయన అంత వర్క్ చేసినా, ఏ రోజూ మీరు ఇలాగే చేయాలని చెప్పలేదు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి 30 రోజుల ముందు మేనరిజమ్, యాస విషయాల్లో ఓ డెసిషన్ తీసుకున్నాం. వర్క్ షాప్ చేశాం.