ఆస్కార్ రేసులో 'నాటు... నాటు...'

ఆస్కార్ రేసులో  'నాటు... నాటు...'

గోల్డెన్ గ్లోబ్ తో సహా పలు అవార్డులు అందుకున్న 'నాటు... నాటు...' సాంగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు నామినేషన్ కు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ఈ పాట దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచుకుంది.

సంచలనాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ఈ మాస్ సాంగ్ కు చంద్రబోస్ అక్షర రూపం ఇవ్వగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి స్వరపర్చారు.