ప్రభంజనం సృష్టించిన సలార్...

ప్రభంజనం సృష్టించిన సలార్...

ముద్ర,తెలంగాణ:- బాహుబలి సినిమాకు ముందు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ రేంజ్ ఇక బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఈ మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్.

అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అయితే పెరుగుతూ వచ్చింది. కానీ సినిమాలలో మాత్రం హిట్ అనే పదం ప్రభాస్ కి బాగా దూరం అయిపోయింది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ ఇటీవలే విడుదలై ఏకంగా సెన్సేషన్ విజయాన్ని సాధించింది. ఇక వసూళ్లలో కూడా దూసుకుపోతుంది ఈ మూవీ. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ త్రూ అవుట్ వరల్డ్‌ హిట్ టాక్ తెచ్చుకుంది. 700కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక క్రమంలోనే ఒక్క తెలంగాణ లోనే 100 కోట్లు వసూలు చేసింది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తరువాత ఈ రేంజ్‌ మార్క్‌ను అందుకున్న సలార్ మూవీ… ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట సెన్సేషన్ అవుతోంది.