బ్లాక్​ డ్రస్​లో నటాషా ఇస్మార్ట్​

బ్లాక్​ డ్రస్​లో నటాషా ఇస్మార్ట్​

హీరోయిన్స్ గ్లామర్ డోస్ రోజు రోజుకి పెంచేస్తున్నారు.  అందులోనూ అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా ఉంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను చూస్తే స్టన్ అవ్వాల్సిందే. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ నబా నటేష్. మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఈ బ్యూటీ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా దీనికోసం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫాలోవర్స్ కి కూడా కావలసినంత వినోదాన్ని అందిస్తూ... ఇక నభా కూడా అదే రూట్లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. బ్లాక్ కలర్ స్కర్ట్ తో  అందాలను ఆరబోస్తూ తెగ హాట్​ ఫొటోస్​ని షేర్​ చేస్తుంది.  స్టైల్ గా షోకేస్ చేస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. కైపెక్కించే ఫోజులతో చూసే ప్రతిఒక్కరికి నేత్రానందం కలిగిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య నభా నటేష్ స్పీడ్ పెంచిన ఈ స్థాయిలో గ్లామర్ డోస్ తో కవ్వించడం మొదటిసారి అని చెప్పాలి.