బైరాన్ పల్లి సాంగ్ ను రిలీజ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్

బైరాన్ పల్లి సాంగ్ ను రిలీజ్ చేసిన మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై  వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ను మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం నాడు రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులు తమ సత్తా చాటుతున్నారని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన ప్రతిభ గల కళాకారులు ఉన్నారని , వారందరినీ తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ కళాకారులతో తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన చిత్రం బైరాన్ పల్లి అని  ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని మంత్రి  కమలాకర్ కోరారు  . సస్పెన్స్  థ్రిల్లర్గా రూపొందించిన బైరాన్ పల్లి  సూపర్ హిట్ అవుతుందని మంత్రి  గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఈ కార్యక్రమంలో నిర్మాత నరేష్ వర్మ ,  సీనియర్ జర్నలిస్టు ,దర్శకులు అయిలు రమేష్ , సంగీత దర్శకులు, గాయకులు పూర్ణచంద్ర బైరి, సీనియర్ నటి ప్రభావతి,  సింగర్ సాయి కీర్తన , నటులు ఆసంపల్లి శ్రీనివాస్ , రాజేష్ దామెర , అశోక వెలిచాల, రమేష్ చిన్న  తదితరులు పాల్గొన్నారు.   ఈ చిత్రంలో విజయ్ కుమార్, ప్రభావతి, కృష్ణ మంజూష, ప్రేమ్ సాగర్ , ప్రసాద్ పొద్దుటూరి ,సురేందర్ రాజు , మాధవి ప్రసాద్ , బలగం సుధాకర్ రెడ్డి, బలగం సుజాత, సురేష్ గడ్డం, లోరా మాడిసన్, సత్య ప్రకాష్, స్నేహ శర్మ  ,డాలియా, సాయి రాజ్ , ప్రిన్స్ వెంకీ , సందీప్ సక్సేనా , రాజేష్ దామెర , శ్రీనివాస్ ఆసంపల్లి, రమేష్ చిన్న తదితరులు నటించారు. ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని దర్శకులు వెంకట్  కాచర్ల తెలిపారు.

కెమెరా :డి వై గిరి

ఎడిటింగ్ : మహేంద్ర నాథ్బ్యా

గ్రౌండ్ స్కోర్  :సందీప్ కుమార్ కనుగుల

మ్యూజిక్ : పూర్ణచంద్ర బైరి

డిటిఎస్ మిక్సింగ్: రమేష్ కామరాజు  (రామానాయుడు స్టూడియోస్)

నిర్మాత: నరేష్ వర్మ

స్క్రిప్ట్ ,దర్శకత్వం: వెంకట్ కాచర్ల.