ఐషా అదుర్స్

ఐషా అదుర్స్

నేహాశర్మ ‘చిరుత’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ దురదృష్టం కొద్ది టాలీవుడ్ లో నేహాశర్మకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లు కూడా నిరాశ పరిచాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ లో నేహాశర్మ సందడి చేస్తోంది. ఇదే సమయంలో నేహా సిస్టర్ ఐషాశర్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

ఆకట్టుకునే అందంతో పాటు ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ తో మెప్పిస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. సోదరితో ఎక్కువగా జిమ్ లో వర్​ అవుట్‌ చేసే ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దీంతో అక్క కంటే ఏమాత్రం తక్కువ కాకుండా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ఆఫర్ల విషయంలో మేకర్స్ ఎందుకు ఈమెపై శ్రద్ధ పెట్టడం లేదో అర్థం కావడం లేందంటూ నెటిజన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.