ఓ సాథియా ట్రైలర్ 

ఓ సాథియా ట్రైలర్ 

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ సాథియా ట్రైలర్ విడుదల అయింది.  ఈ కార్యక్రమంలో నిర్మాత KS రామారావు మాట్లాడుతూ..* ఒక చిన్న సినిమా తీసి, రిలీజ్ అవ్వడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ గారు కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడాలి అప్పుడే పైకి వస్తాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయాలి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ సంస్థ UFO రిలీజ్ చేయడం చాలా మంచి విషయం. UFO లాంటి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడం ఈ సినిమా వాళ్ళ అదృష్టం. నేను కూడా సినిమా కెరీర్ లో చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు బాగుంది అని చెప్తే సినిమా సక్సెస్ అయినట్టే.