వర్క్‌ మోడ్‌ స్టార్ట్‌.

వర్క్‌ మోడ్‌ స్టార్ట్‌.

ఎట్టకేల‌కు జేజమ్మ మ‌నసులో మాట బ‌య‌ట‌పెట్టింది. ‘ఇంతకాలం కావాల‌ని విశ్రాంతి తీసుకున్నాను. ఇక మ‌ళ్లీ మొదలయింది. వర్క్‌ స్టార్ట్‌’ అంటోంది. మాలీవుడ్ లో కూడా ఓ సినిమాతో లాంచ్ అవుతుంది. ఇది అమ్మడికి కొత్త ర‌క‌మైన ఎక్స్ పీరియన్స్. కోలీవుడ్, టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. కానీ సౌత్‌లో పెండింగ్ ఉన్న మాలీవుడ్ లోకి ఇప్పుడు వెళ్తోంది. రేపో మాపో క‌న్నడ‌లోనూ ఎంట్రీ ఇచ్చేస్తుంది. అవ‌న్నీ ప‌క్కన‌బెడితే టాలీవుడ్ లో అనుష్క కం బ్యాక్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తిక‌రం. మునుప‌టిలో అనుష్క మ‌ళ్లీ బిజీ హీరోయిన్ అవుతుందా? హీరోలు.. ద‌ర్శక‌ -నిర్మాత‌లు గ‌తంలో లాగా ఆద‌రిస్తారా? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌రిశ్రమ గురించి తెలిసిన వాళ్లెవ‌వ‌రూ ఎక్కువ గ్యాప్ తీసుకోవ‌డానికి ఇష్టప‌డ‌రు. ఎందుకంటే గ్యాప్ అనేది ఇమేజ్ పై ప్రభావం చూపిస్తుంది. అందులోనూ హీరోయిన్లపై ఆ ప్రభావం చాలా బ‌లంగా ఉంటుంది. అలాంటిది అనుష్క లాంగ్ గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇస్తోంది.