ప్రేమ బంధాలు | Mudra News

ప్రేమ బంధాలు | Mudra News

ప్రేమ పెళ్లిళ్లు... వ్యాలెంటైన్స్​డే అంటే... ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ఏదో తెలియని ఓ వైబ్రేషన్ అందరిలోనూ కలుగుతుంది. అందులో యువతరం కుర్రకారులో అయితే అది ఇంకాస్త ఎక్కువ యాంగ్జైటీ అనే చెప్పాలి. తాము జీవితంలో మొదటిసారి ప్రేమలో పడిన ఆ రోజును కానీ.. క్షణాన్ని కానీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. అలాగే మన హీరోలకు కూడా వాలంటైన్స్ డే చాలా స్పెషల్. ఎందుకంటే సౌత్‌లో చాలా మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమకు కావాల్సిన జీవిత భాగస్వామిని వెతుక్కున్నారు. పెద్దలను ఒప్పించి కొందరు.. ఎదిరించి మరికొందరు ఒక్కటయ్యారు. తమ ప్రేమలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు ఏవో ఒక్కసారి చూద్దాం..


1. రానా-మిహీకా బజాజ్: అసలు పెళ్లి చేసుకుంటాడో లేదో అనే అనుమానాల నుంచి ప్రేమలో పడి.. పెళ్లి వరకు వచ్చాడు రానా. 2020లో ఈయన తను ప్రేమించిన మిహీకాను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు రానా.


2. నితిన్ - షాలిని: నితిన్ కూడా ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. ఈయన కూడా ఐదేళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు కానీ విషయం బయటికి రానీయలేదు. చివరికి పెళ్లితో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 2020లో నితిన్, షాలిని వివాహం జరిగింది.


3. మహేష్ బాబు - నమ్రత: మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. వీళ్ళ పెళ్లి చాలా ప్రైవేట్‌గా జరిగింది. 2005లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు.


4. శ్రీకాంత్ - ఊహ: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందమైన కపుల్స్‌లో శ్రీకాంత్, ఊహ కూడా ఉంటారు. ఆమె సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జోడీ.. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేసారు. మెల్లగా తన కుటుంబానికి ఊహను పరిచయం చేసి.. ఫంక్షన్స్‌కు పిలిచి.. ఆ తర్వాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. 1997లో ఇద్దరి పెళ్లి జరిగింది. ఈ మధ్యే 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ జోడీ.


5. నాగార్జున - అమల: నాగార్జున కూడా ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మిని మొదటి పెళ్లి చేసుకున్న నాగార్జున.. కొన్నాళ్ళ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. 1992లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది.


6. అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్రేమ వివాహమే చేసుకున్నాడు. తాను ప్రేమించిన స్నేహా రెడ్డిని ఇంట్లో పరిచయం చేసి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు బన్నీ. 2011లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.


7. నాగ చైతన్య - సమంత: తెలుగు ఇండస్ట్రీలో మరో క్యూట్ లవ్ స్టోరీ నాగ చైతన్య, సమంత సొంతం. ఇద్దరూ తమ ఆరేళ్ల రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకున్నారు. నాలుగేళ్ళ పెళ్లి బంధం తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోయారు.


8. నాని - అంజనా: న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ కూడా భిన్నంగా ఉంటుంది. సినిమా రేంజ్‌లో ఉంటుంది ఈ ఇద్దరి లవ్ స్టోరీ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నపుడే అంజనా ప్రేమలో పడిపోయాడు నాని. తాను హీరో అయిన తర్వాత ఇంట్లో ఒప్పించి 2012లో ఒక్కటయ్యారు నాని, అంజనా.


9. విష్ణు - విరోనికా: మంచు విష్ణు సైతం ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కూతురు అయిన విరోనికాను ప్రేమించి.. మోహన్ బాబును ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు విష్ణు. ఈ ఇద్దరి పెళ్లి 2008లో జరిగింది.


10. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిల్లు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనమే. తన మొదటి భార్యతో విడిపోయిన తర్వాత.. ఏడేళ్లకు పైగా రేణు దేశాయ్‌తో సహజీవనం చేసి 2008లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.


11. రాజశేఖర్ - జీవిత: రాజశేఖర్ పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు జీవిత. భార్య భర్తలో సగం అంటారు కదా.. రాజశేఖర్ జీవితలను చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ ఇద్దరి జోడీ అన్యోన్యతకు మారుపేరు. 1991లో జీవిత, రాజశేఖర్ పెళ్లి చేసుకున్నారు.


12. కమల్ హాసన్ - సారిక: కమల్ హాసన్ సైతం ప్రేమ వివాహమే చేసుకున్నాడు. 80ల్లో సారికతో ప్రేమలో పడిన కమల్.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే శృతి హాసన్ పుట్టింది వీళ్ళకు.


13. సూర్య - జ్యోతిక: తమిళ హీరో సూర్య తనతో పాటు కాక కాక, మాయావి లాంటి సినిమాలలో నటించిన జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2006లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.


14. కృష్ణ - విజయ నిర్మల: సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మొదటి భార్య ఇందిరా దేవిని ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈయన.


15. సీనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి: వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ లక్ష్మీ పార్వతిని 74 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.


16. అజిత్ - శాలిని: తమిళ హీరో అజిత్.. హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే.. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు అజిత్ కోసం అన్నీ వదిలేసి పెళ్లి పీటలెక్కింది షాలిని.


17. ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్: ధనుష్, ఐశ్వర్య కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. తన కంటే వయసులో రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్యను 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. ఈ మధ్యే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.


18. రామ్ చరణ్ - ఉపాసన: మెగా వారసుడు రామ్ చరణ్ సైతం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉపాసనతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈయన.. ఇరు కుటుంబాలను ఒప్పించి 2012లో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.