మరీ ఇంత క్రేజా... బాబోయ్​?

మరీ ఇంత క్రేజా... బాబోయ్​?

హనీ రోజ్.. హనీరోజ్​.. హనీరోజ్​.. ఎక్కడా చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ఈమె ఏకంగా ప్రజంట్​ ట్రెండీ హీరోయిన్​ అయిపోయిందండోయ్.. ఇంతకీ ఎవరీ హనీ అనుకుంటున్నారా..ఈమె కెరీర్​ వీరసింహారెడ్డికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. ఈ చిత్రంలో హనీ రోజ్.. మీనాక్షి పాత్రతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందంతో పాటు నటనతోనూ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.  ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో మస్తు క్రేజ్ పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి మలయాళం లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు వీరా క్రేజ్ తో తెలుగులో కూడా వరుస ఆఫర్లు రావడం ఖాయం అని రుజువు చేసుకుంది.

ఒక రకంగా సీనియర్ హీరోలకి కూడా ఈ హీరోయిన్ తగిన జోడి అంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్​కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. దీంతో ఇదంతా చూసి బౌన్సర్లు పోలీసులే షాక్ అయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది.