గడపగడపకు గ్యారంటీ పథకాలు

గడపగడపకు గ్యారంటీ పథకాలు

మహాదేవపూర్, ముద్ర: ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారంటీ పథకాలను ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నాయకులు కార్డులను పంపిణీ చేశారు.అన్నారం, సూరారం వేరువేరుగా ఎంపీటీసీ మంచినీళ్ళ దుర్గయ్య, ఎంపీటీసీ తిరుమల ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులోని హామీలను అమలు చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500, లు 500 కి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.రైతు భరోసా పథకం కింద ప్రతి రూ.15000 లు రూ 12000, లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల 500 బోనస్.గృహ జ్యోతి పథకం క్రింద ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం క్రింద ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నారు.యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పింఛన్ ఆసరా పెన్షన్ క్రింద 4,000/- రూపాయలకు పెన్షన్ పెన్షన్ పెంపు కల్పించనుందని వివరించారు.