గ్రూప్​ –1 రద్దు ... నోటిఫికేషన్​ క్యాన్సిల్​ చేస్తూ ఉత్తర్వులు

గ్రూప్​ –1 రద్దు ... నోటిఫికేషన్​ క్యాన్సిల్​ చేస్తూ ఉత్తర్వులు

ముద్ర,తెలంగాణ:- రాష్ట్రంలో గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరి కొన్ని పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అరవై పోస్టులను అదనంగా కలుపే అవకాశాలున్నాయి. 
ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ –1 నోటిఫికేషన్ ను దర్దు చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ మళ్లీ రద్దు చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేసే అవకాశముంది. గతంలో ప్రశ్నాపత్రం లీకు కావడంతో పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

పరీక్షలు రద్దు...

టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ కేసు కలకలం సృష్టించడంతో మొదట్లో గ్రూప్– 1 పరీక్ష రద్దయింది. ఆ తర్వాత నిర్వహించిన అదే పరీక్షలో బయోమెట్రిక్ నిబంధనను పాటించలేదని మరోసారి రద్దయింది. 2022లో 503 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్‌ ఇచ్చింది. త్వరలో టీఎస్పీఎస్సీ కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వనుంది. ప్రభుత్వం ఇటీవలే గ్రూప్-–1 పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ కి అదనంగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇంతలోనే తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.