నాలుగున్నర దశబ్దాలు గడిచిన జీవన్ రెడ్డికి రాజకీయ దాహం తీరడం లేదా?

నాలుగున్నర దశబ్దాలు గడిచిన జీవన్ రెడ్డికి రాజకీయ దాహం తీరడం లేదా?
  • ఒక బిసి బిడ్డను ఓడించి,  మరో బిసి బిడ్డను ఓడించేందుకు కుట్రనా?
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల, ఫిబ్రవరి 19:  నాలుగున్నర దశబ్దాల రాజకీయ జీవితం గడిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాజకీయ దాహం తీరకపోవడం దురదృష్టకరమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని కమల నిలయంలో విలేకరుల సమావేశంలో డా. శ్రావణి మాట్లాడుతూ ఇటీవలే ఒకరిని గెలిపించడానికి బిసి ఆడ బిడ్డను ఓడించిన జీవన్ రెడ్డి, మళ్ళీ మరో బిసి బిడ్డను ఓడించేందుకు కంకణం కట్టుకున్నరన్నారా అని ప్రశ్నించారు. సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న జీవన్ రెడ్డి  అర్వింద్ తో అభివృద్ధిలో పోటీ పడాలి, వ్యక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప, మా పార్టీలో సస్పెండ్ అయిన వారితో దిష్టి బొమ్మ దహనం చేయించడం, కరపత్రాలు పంచడం, దిష్టి బొమ్మ దహనంలో మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టవద్దని మీ కుటుంబీకులు అండగా నిలవడం సరికాదన్నారు. దశబ్దాల రాజకీయ జీవితం లో అనేక పదవులు అనుభవించిన మీరు యావర్ రోడ్ విస్తరణ, మ్యాంగో మార్కెట్,  పసుపు, చేరుకు రైతులకు చేసింది ఏంటో చెప్పాలన్నారు.  

జీవన్ రెడ్డి గెలవడం కోసం, అర్వింద్ టికెట్ రాకుండా చేయడం ఆయన  కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ప్రపంచ దేశాల్లో మోదీ మానియా కొనసాగుతుందని, ఎంపీగా పోటీ చేసి మీరు చేసేది ఏముందని, ఎమ్మెల్సీ గానే కొనసాగుతూ ప్రజా సేవలో ఉండండి తప్ప, బిసి బిడ్డను ఒదించేందుకు  కుటిల రాజకీయా కుట్రలు చేయవద్దని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు అనుమల్ల కృష్ణ హరి, జిల్లా కోశాధికారి సుంకట దశరథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలవాల తిరుపతి, అర్బన్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, సిరికొండ రాజన్న,పవన్ సింగ్, మమత, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.