కొత్త కలెక్టరేట్‌లో.. ఏ శాఖ ఎక్కడంటే..!

కొత్త కలెక్టరేట్‌లో.. ఏ శాఖ ఎక్కడంటే..!
  • కొలువుతీరిన అన్ని శాఖలు
  • నూతన ఉత్సాహంతో పరిపాలన సేవలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా : జిల్లా కేంద్రంలోనీ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాల సముదాయములో వివిధ ప్రభుత్వ శాఖల వారిగా గదులను కేటాయించారు. జీ ప్లస్‌ టూ విధానం తో నిర్మించిన ఇంటిగ్రేటేడ్‌ కలెక్టరేట్‌ భవనంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కొంత కష్టమే. నాగర్ కర్నూలు పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో 2017 అక్టోబర్‌ 1వ తేదీన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మా ణానికి శంఖుస్థాపన  జరిపారు. ఈనెల జూన్ 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు లంచనంగా ప్రారంభించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

సుమారు 12.30  ఎకరాల్లో రూ. 52.20 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్‌ కలేక్టరేట్‌ భవన నిర్మాణం జరిపారు. దాదాపు 99 గదులకు పైగా ఉన్న ఈ భవనాన్ని వివిధ బ్లాక్‌లతో వర్గీకరించారు. వాటిలో 42 శాఖలకు కేటాయింపులతో అన్ని శాఖలు సమీకృత కార్యాలయంలో కొలువు తీరాయి. కింది అంతస్తు జీ, మొదటి అంతస్తు యఫ్, రెండవ అంతస్తు యస్ లో గదుల కేటాయింపులు జరిపారు. సుమారు మొత్తం 42 ప్రభుత్వ శాఖలు ఇందులోకి మారా పరిపాలన కొనసాగుతుంది. ప్రవేశ మార్గం నుంచి వస్తే ఏ శాఖకు ఎటువైపు వెళ్లాలో వివరిస్తూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అందిస్తున్న సమాచారత్మక కథనమిది....

కింది అంతస్తుజీలో ...

జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో  జీ అంతస్తులో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు గదుల కేటాయింపు జరిపారు. ఇందులో రూమ్‌ నంబరు జి1లో జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయాన్ని, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయాన్ని, రూమ్‌ నంబరు జీ2లో ఏటీఎం, జి3లో షాప్, జి4లో కార్మిక శాఖ, జిల్లా వయోజన విద్య మరియు తూనికలు కొలతలు శాఖల కార్యాలయాలకు కేటాయించారు. రూమ్ నంబర్ జి 5ను ఎన్.ఐ.సి జాతీయ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌గా, జి6 జిల్లా మహిళా శిశు సంక్షేమ దివ్యాంగులు వయోవృద్ధుల కార్యాలయానికి కేటాయించారు. 

రూమ్‌ నంబరు జి7లో సర్వే మరియు భూ రికార్డుల అధికారి కార్యాలయం , రూమ్‌ నంబరు జి8ను కలెక్టరేట్‌ ఈ,డి విభాగాల కొరకు, జి9లో కలెక్టరేట్ రికార్డ్ గది, 12, 13లో జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయం. రూమ్ నెంబర్ 16 సర్వర్ రూమ్,17 జిల్లా మైనింగ్ కార్యాలయానికి, రూమ్ నెంబర్ 18 ఎలక్ట్రికల్ రూమ్, జి 19 జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాంబర్, జి 20 స్టోర్ రూమ్, రూమ్ నెంబర్ 21 కలెక్టరేట్ విభాగాలు, 22 అటెండర్స్ రూమ్స్, 23 కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏవో చాంబర్, జి 24 కలెక్టరేట్  విభాగాలు, జి 25 స్టోర్ రూమ్, జి 26 అదనపు కలెక్టర్ రెవిన్యూ ఛాంబర్, జి 27 అదనపు కలెక్టర్ రెవిన్యూ సీసీ చాంబర్, జి 30 సర్వర్ రూమ్, జి 31 ఎలక్ట్రికల్ రూమ్, జి 32 స్టోర్ రూమ్, జి 33 గది కలెక్టరేట్ ఇన్ వర్డ్ అవుట్ వార్డ్ జిల్లా ఎలక్షన్ విభాగం, జి 36 ప్రధాన మీటింగ్ సమావేశం మందిరం ప్రజావాణి హాల్, జి 37 జిల్లా కలెక్టర్ ను కలిసి ఎందుకు వచ్చే ప్రజలకు వెయిటింగ్ హాల్, జి 38 అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సిసి చాంబర్, జి 39 అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల చాంబర్, జి 40 మినీ కాన్ఫరెన్స్ హాల్, జి 41  కలెక్టర్ పిఏ గది. జి 42జిల్లా కలెక్టర్  చాంబర్‌ను, ఇతర సదుపాయాలను ఏర్పరిచారు. అదేవిధంగా ఒకటి రెండు అంతస్తులు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జిల్లా పర్యటనకు వచ్చే మంత్రుల కోసం కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో ప్రత్యేకంగా గదులను కేటాయించారు.

మొదటి అంతస్తులో...

సమీకృత కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో ఎఫ్ 1వ నంబరు రూమ్‌ను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, స్త్రీ నిధి,  స్టాఫ్‌కు, ఎఫ్2వ నంబరు గదిని కార్యనిర్వహక ఇంజనీర్ మిషన్ భగీరథ ఇంట్రా  అధికారి,ఎఫ్ 3, 4లను జిల్లా పంచాయతీ  శాఖ అధికారి కార్యాలయానికి, 5ను జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కార్యాలయం,ఎఫ్ 8లో జిల్లా పరిశ్రమల కార్యక్రమలంకు, ఎఫ్11లో ఎలక్ట్రికల్‌ పరికరాలకు, ఎఫ్12 నంబరు గదిని కాన్ఫ రెన్స్‌ హాలుగా,ఎఫ్ 14, 15వ నంబరు గదిని జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి సమగ్ర శిక్ష కార్యాలయానికి, ఎఫ్16 వంటగది, ఎఫ్ 17వ నంబరు గదిని జిల్లా మద్య నిషేధ,ఆబ్కారీ  శాఖకు, 18,19వ నంబరు గదులను జిల్లా పౌర సరఫరాల శాఖ కు, 25 నంబరు గదిని జిల్లా పే మరియు అకౌంట్స్ కార్యాలయం, జిల్లా ఖజానా శాఖ కార్యాలయానికి, 26వ నంబరు గదిని జిల్లా వ్యవసాయ,సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ శాఖకు, 27వ నంబరును జిల్లా గిరిజన అభివృద్ధి సంక్షేమ సంక్షేమ శాఖకు, ఎఫ్28వ నంబరును జిల్లా సహకార సంఘాల శాఖకు,ఎఫ్ స్టేట్ ఛాంబర్ జిల్లా కు వచ్చే మంత్రులు వినియోగించేందుకు   కేటాయించారు.

రెండవ అంతస్తులో...

సమీకృత కలెక్టరేట్‌లోని రెండవ అంతస్తులో వివిధ శాఖలకు గదుల కేటాయింపు జరిగింది. రెండవ అంతస్తులోని యస్1వ నంబరు గదిని జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి ఎస్సీ కార్పొరేషన్ కు, యస్ 2,3 నంబరు గదుల ను జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖకు,  యస్ 4 గదిని మత్స్యశాఖ కార్యాలయానికి,యస్ 8 కాన్ఫరెన్స్‌ హాలుగా, యస్ 10 నంబరు గదిని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్  కార్యాలయాని కి, యస్13 14వ గదులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖకు,  15,16వ నంబరు గదులను  జిల్లా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి, యస్ 17 వ నంబరు గదిని జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ కార్యాలయానికి, 18వ నం బరు గదిని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయానికి, 19,20వ నంబరు గదులను జిల్లా ఆడిట్ అధికారి కార్యాలయానికి 25వ నంబరు గదిని జిల్లా మైనారిటీ సంక్షేమ  శాఖ కు, 26,27,28 వ నంబరు గదులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇప్పటివరకు జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లినా అక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం నూతన కలెక్టరేట్‌ భవనంలో అవసరమైన ప్రాంతాల్లో టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. విశాల మైన రహదారులు, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని శాఖల జిల్లా కార్యాలయాలన్నీ కొలువుతీరాయి.

స్వచ్ఛత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లను నెలకొల్పింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసింది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అంతే జవాబు దారితనంగా సేవలందించేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృత నిశ్చయంతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. నూతన ఉత్సాహంతో ప్రతి ఉద్యోగి నిస్వార్ధంగా సేవలు అందించి,జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందాలి. నూతన సమీకృత కార్యాలయాన్ని స్వచ్ఛత పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తోపాటు వివిధ పనుల అవసరాలకు వచ్చే ప్రజలు కూడా కార్యాలయ పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్