‘ప్రేమలో.. పాపలు బాబులు’ టైటిల్, కాన్సెప్ట్ రెండూ కొత్తగా ఉన్నాయి

‘ప్రేమలో.. పాపలు బాబులు’ టైటిల్, కాన్సెప్ట్ రెండూ కొత్తగా ఉన్నాయి


శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమలో..’. ‘పాపలు బాబులు’ అనేది ట్యాగ్ లైన్. అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సోమవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.  ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాత లయన్ సాయి వెంకట్,నటుడు సమీర్, నిర్మాత విజయ మాధవి, డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, హీరో అభిదేవ్, సినిమాటోగ్రాఫర్ వంశీ, ఎస్.జి..ఆర్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా, ఫ్రాంక్లింగ్ సుకుమార్  తదితరులు పాల్గొన్నారు. బ్యానర్ లోగోను తుమ్మల పల్లి రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా... నిర్మాత విజయ మాధవి బల్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటికి మా ఆయన నాలుగు సినిమాలు చేశారు. ఓ పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటూ ఉంటారు. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. గత 22 ఏళ్లుగా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. అందుకే నేను నిర్మాతగా మారాను. మా ఆయన కోసమే నేను నిర్మాతగా మారాను. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మున్ముందు మరెన్నో మంచి చిత్రాలు తీయాల’ని కోరుకుంటున్నాను.