K Vishwanath Wife Jayalakshmi Died తీవ్ర విషాదంలో  విశ్వనాధ్‌ కుటుంబం..

K Vishwanath Wife Jayalakshmi Died తీవ్ర విషాదంలో  విశ్వనాధ్‌ కుటుంబం..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఫిబ్రవరి రెండో తేదీన కళాతపస్వికే విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అది  మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కె విశ్వనాథ్ మరణించినప్పటి నుంచే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.

అనారోగ్య పరిస్థితులు విషమించడంతో ఈరోజు సాయంత్రం 6:15 నిమిషాల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తమ తండ్రి కె విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పార్థివ దేహాన్ని కొద్దిసేపట్లో ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న నివాసానికి తరలించనున్నారు. రేపు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరపబోతున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు..శ్రీ కాశీనాధుని జయలక్ష్మి వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పుడే కే విశ్వనాథ్ తో వివాహం జరిగింది.