31 వ‌సంతాల‌ బాద్ షా   సినీ జ‌ర్నీ

31 వ‌సంతాల‌ బాద్ షా   సినీ జ‌ర్నీ

ఈ ఏడాది ప్రారంభంలో ప‌ఠాన్ వంటి బ్లాక్ బ‌స్టర్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్లగొట్టి త‌న స‌త్తా చాటారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌. సెప్టెంబ‌ర్ 7న మ‌రోసారి పాన్ ఇండియా లెవ‌ల్లో సంద‌డి చేయ‌టానికి ఆయ‌న సిద్ధమ‌వుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే షారూక్ ఈ ఏడాదితో సినీ జ‌ర్నీతో 31 వ‌సంతాల‌ను పూర్తి చేసుకోవ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అభిమానులు, ఫాలోవ‌ర్స్‌తో ఆస్క్‌ షారూఖ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.క‌వ‌ల పిల్లలకు పేర్లు..ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, డాక్టర్ క‌వ‌ల పిల్ల‌ల‌ని చెప్పారు. వారికి ప‌ఠాన్‌, జ‌వాన్ అనే పేర్లు పెట్టాల‌నుకుంటున్నా’న‌ని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు. అలా కుదరదు.. ఓ అభిమాని త‌న స్నేహితుడు కోసం జ‌వాన్‌లో పాత్ర‌ను ఇవ్వాల‌ని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ.. ‘అలా చేయ‌టం కుద‌ర‌ని ప్రేమ‌తో మీ స్నేహితుడుకి అర్థమ‌య్యేలా చెప్పండి’ అన్నారు.