ట్రైలర్ చాలా బాగుంది...హీరో సత్యదేవ్

ట్రైలర్ చాలా బాగుంది...హీరో సత్యదేవ్

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.  మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 21 పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘స్లమ్ డగ్ హజ్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసు. జ్యోతిలక్ష్మి టైంలోనే విన్నాను. పూరి దగ్గర మేం ఉన్న సమయంలోనే ఈ కథ తెలుసు. కానీ ఇంత ఎంటర్టైనర్‌గా ఉంటుందని అనుకోలేదు. సంజయ్, ప్రణవిలకు ఆల్ ది బెస్ట్.  ట్రైలర్ బాగుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నా కొడుక్కి సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారు అన్నారు.