పరమపద సోపానం టీజర్

పరమపద సోపానం టీజర్

మాఫియా అక్రమాల నేపథ్యంలో SS  మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేస్తూ వదిలిన ఈ టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.