ఘనంగా విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర, చొప్పదండి : చొప్పదండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2006-08 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చదువుకున్న నాటి మధుర స్మృతులు గుర్తు తెచ్చుకొని ఆనందంగా,ఉల్లాసంగా గడిపారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు సంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం వారి అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.