కల్వరాల గ్రామానికి ఇంటర్మీడియేట్ బాలికల వొకేషనల్ కళాశాల మంజూరు చేయించండి

కల్వరాల గ్రామానికి ఇంటర్మీడియేట్ బాలికల వొకేషనల్ కళాశాల మంజూరు చేయించండి
  • మంత్రి జూపల్లి కి కల్వరాల నరసింహ అధ్వర్యంలో గ్రామ యువకులు వినతిపత్రం

ముద్ర.వీపనగండ్ల:- మండల పరిధిలోని కల్వరాల గ్రామానికి ఇంటర్మీడియేట్ బాలికల వొకేషనల్ కళాశాల మంజూరు చేయించాలని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కు కల్వరాల నరసింహ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.పదవ తరగతి తర్వాత చాలా మంది బాలికలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, గ్రామంలో బాలికల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కళాశాల ఏర్పాటు చేస్తే వీపనగండ్ల మండలం తో పాటు చిన్నంబావి, శ్రీరంగాపురం, పానగల్ మండలాల విద్యార్థులకు అనువుగా ఉంటుందని  మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.గ్రామంలో ఒకేషనల్ కళాశాలకు కావలసిన అన్ని రకాల వసతులు ఉన్నాయని మంత్రికి వివరించారు.ప్రతిగా మంత్రి జూపల్లి స్పందిస్తూ కాల్వరాల గ్రామం విద్యాపరంగా చాలా ముందు వరుసలో ఉందని తప్పకుండా కళాశాల మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు దయాకర్,సుధాకర్,శ్రీకాంత్, కూరుమయ్య, భరత్ చారి, అరవింద్,మహేష్,పృథ్వి లు ఉన్నారు.