ప్రతీ కుటుంబానికి అయోధ్య రామాలయ అక్షింతలు

ప్రతీ కుటుంబానికి అయోధ్య రామాలయ అక్షింతలు
  • జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం

ముద్ర,మెదక్: రామజన్మభూమి అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను ప్రతీ కుటుంబానికి పంపిణీ చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు  తెలిపారు.  సోమవారం మెదక్ కోదండ రామాలయంలో  ఆలయ అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు ఆధ్వర్యంలో అక్షింతలకు పూజలు నిర్వహించారు. ఈనెల 22న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇదే సమయంలో దేశంలోన్ని అన్ని దేవాలయాల్లో దేవతామూర్తులకు రామభక్తులు విశేష పూజలు చేయాలని కోరారు. పవిత్ర మంత్రాక్షతలను ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఇంట్లో దీపకాంతుల వెలుగులు విరజిమ్మంపజేయాలని పిలుపునిచ్చారు. అక్షింతలు 10 క్వింటాళ్ల బియ్యం అందజేసిన దాత ఉట్కూరి వీరేశం గుప్తను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సంయోజక్ ఆరేళ్ల అరవింద్ గౌడ్, సహసంయోజక్ సుంకరి కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్, సభ్యులు, సకిలం శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.