సైదాబాద్ ఏఎస్ ఐకి ఊహించని షాక్!

ముద్ర, హైదరాబాద్: ఎన్నికల వేళ... నిబంధనలు ఉల్లంఘించిన ఒక మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. ఇంతకూ ఆమె ఏం చేశారంటే... హైదరాబాద్ బీజేపీ ఎంపీ  మాధవీలత ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో, ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆమెను ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి విధుల్లో వున్న పోలీస్ అధికారి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.