పెరిగిన గ్యాస్  ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

పెరిగిన గ్యాస్  ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి
  • 2 న నియోజకవర్గ కేంద్రాలలో...3 న మండల కేంద్రాలలో ధర్నాలు,నిరసన ప్రదర్శనలు
  • బి ఆర్ యస్ శ్రేణులు,మహిళలను సన్నద్ధం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
  • టేలికాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

హైద్రాబాద్ ముద్ర న్యూస్ : పెరిగిన వంట గ్యాస్ ధరలపై బి ఆర్ యస్ పార్టీ యుద్ధభేరి మ్రోగించింది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు,నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు నిచ్చింది.ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను,బి ఆర్ యస్ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ పిలుపు మేరకు ఈ నెల 2 న అంటే గురువారం ఉదయం నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు ,ఆ మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 3 న మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు.

అటు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఇటు మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో బి ఆర్ యస్ శ్రేణులతో పాటు మహిళలు అధికంగా పాల్గొనేలా చూడాలి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.