చత్తీస్ ఘడ్ జిల్లాలో  మావోయిస్టుల ఘూతకం

చత్తీస్ ఘడ్ జిల్లాలో  మావోయిస్టుల ఘూతకం
  • ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా నూ గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ని నారాయణ్‌పూర్ జిల్లా చోతేదోంగర్ గ్రామ స్థుడ్ని శనివారంసాయంత్రం మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంఝ అని పోలీస్‌లు తెలిపారు.చోతేదోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంఝ ఆయన తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగిందని, వీరిద్దరిని గతంలో చంపు తామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.

గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. వారిలో వీరిద్దరు ఉన్నారు.రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరు తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు.మంఝ హత్య సంగతి విషయం తెలుసుకొని పోలీస్ ల బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలిం చారు. హత్య జరిగిన ఘటన వద్ద మావోయిస్టుల  లేక దొరికింది.మంఝ, అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా పని చేస్తు న్నాడని, అక్రమంగా భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడని అ లేఖలో  పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు పెద్దఎత్తున అ ప్రాంతంలో గాలింపు చేపడుతున్నారు.